AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
Published on Mon, 06/15/2026 - 23:20
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు. కానీ ఈ ఈవెంట్లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్‌తో, గులాబీ రంగు సూట్లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్‌ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్‌కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్‌తో పాటు వింటేజ్ లుక్‌ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్ బెబో అని ఎందుకంటారు? తన లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్‌కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.
అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్‌కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది.
Tags : 1