AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
Published on Mon, 06/15/2026 - 09:28
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.
తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం.
Tags : 1