Breaking News

మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. పుట్టిన గడ్డ కోసం..!

Published on Sun, 06/14/2026 - 11:32

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నెరవేర్చారు. తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో విద్యార్థులకు సాయం అందించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేశారు. తన స్వగ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించారు

తాజాగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్ పేరిట ఎంపికైన జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. ఈ ఉపకార వేతనాలతో దాదాపు 180 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. ఈ ఏడాది తన సొంతూరిలో పర్యటించిన విజయ్ దేవరకొండ విద్యార్థులకు మాటిచ్చారు. ఇవాళ అఫీషియల్‌గా తన మాటను నెరవేర్చారు. 

హీరో విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామానికి చేస్తున్న సేవపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతూరిపై తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాయల సీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
 

 

Videos

IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక

నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?

మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..

చింతమనేనికి ఈడ్పుగంటి శ్రీనివాస్ మాస్ వార్నింగ్

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

Photos

+5

మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ

+5

తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు)

+5

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)