Breaking News

ఆ రోజుల్లో రొమాన్స్ కామన్.. ఇప్పుడేమో వేధింపులు: పెద్ది వివాదంపై మధుబాల

Published on Thu, 06/11/2026 - 17:36

రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్‌ టాక్‌తో పాటు.. వివాదానికి కేరాఫ్‌ ‍అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌ రోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్‌ గ్లామర్‌ సీన్స్‌ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్‌ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్‌ మూవీ నుంచి తీసేశారు. 

ఈ వివాదంపై ఇ‍ప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. ‍తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటి కూడా చేరిపోయింది.  సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని  నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అ‍భ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్‌ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్‌లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్‌ రొమాంటిక్‌గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు.  ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్‌లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. ‍అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. 

ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న  సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు.
 

Videos

11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్

లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP నిరసన

అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే?

నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు

రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!

ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!

నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ

సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ

Photos

+5

చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్‌సీపీ సమర శంఖం (ఫొటోలు)

+5

కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)

+5

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

+5

‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)

+5

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)