Breaking News

‘గ్రాండ్‌ఫేర్‌వెల్‌’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!

Published on Fri, 06/05/2026 - 13:10

ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్‌ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్‌లోని చెన్మాద్‌ వెస్ట్‌ గవర్నమెంట్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో హెడ్మాస్టర్‌గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్‌ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్‌ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.

నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్‌
చెన్మాద్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్‌ జమాద్‌ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ  బెన్నీ ఎక్కడ పని  చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. 

ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్‌ స్కూల్‌కి రప్పించారు. హెడ్మాస్టర్‌గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. 

పాఠశాలకు రెగ్యులర్‌గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్‌గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్‌ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు.  

తమ గురువు రిటైర్మెంట్‌ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు.  

(చదవండి:  ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..)

#

Tags : 1

Videos

స్పా సెంటర్ల ముసుగులో దారుణాలు

భారత్ మా సోదర దేశం.. ఇండియాపై పుతిన్ ప్రశంసల వర్షం

ఇంత దారుణంగా మహిళలను పోలీసులు కొడుతుంటే సినిమా చూస్తున్నావా..

పేరుకే జనసేన.. 4 రాజ్యసభ సీట్లు టీడీపీకే!

నందుస్ వరల్డ్ మధుకర్ సంచలన ఆడియో లీక్

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కమలం గూటికి మల్లారెడ్డి

చంద్రబాబు గుట్టు రట్టు.. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ గంగపాలు

ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!

61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి

సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?

Photos

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)