Breaking News

బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..!

Published on Wed, 05/27/2026 - 08:45

నట్స్‌ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు.

బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ  12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. 

ఎందుకంటే..
పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్‌ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్‌, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. 

ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్‌ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్‌ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. 

నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాదు నానబెట్టడం వల్ల గింజలు ఉత్తేజితమై..మెలకెత్తే ప్రక్రియను ప్రారంభించే ఎంజైములు సైతం యాక్టివ్‌ అవుతాయట. దీని వల్ల బి విటమిన్‌ పరిమాణం పెరుగుతుందట. అంటే ఇలా అన్ని గంటల పాటు నానడం వల్ల బాదం పప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు నేరుగా అందేలా సులభంగా జీర్ణం అవుతుంది. పైగా మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. 

అదే అలానే బాదం పప్పులు గట్టిగానే తినేస్తే..శరీరం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బందిపడటమే కాకుండా..దానిలో  ఉన్న ప్రోటీన్లు మన శరీరానికి అందవని, పైగా ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టే సమయం పెరిగే కొద్ది ఎంజైమ్ క్రియాశీలత, పోషకాల లభ్యత క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత పూర్తిగా కడగడం వల్ల ఎంజైమ్‌ల నిరోధకం అయిన ఫైటిక్‌ అమ్లం  పూర్తిగా తొలిగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి నానబెట్టే బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.

(చదవండి: ఎర్ర జామ వర్సెస్‌ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?)


 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)