Breaking News

సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?

Published on Sun, 05/24/2026 - 20:34

స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి చాలారోజులు అయింది. కానీ ఈయన చివరి సినిమాకు మాత్రం మోక్షం దొరకట్లేదు. స్వయంగా నిర్మాతే రీసెంట్‌గా ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని చెబుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? 'జన నాయగణ్' విడుదల ఎప్పుడు?

(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)

తమిళ స్టార్ హీరో అయిన విజయ్.. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోతే తిరిగి మూవీస్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో ఇక సినిమాలు చేయడం కష్టమే. అందుకే 'జన నాయగణ్' ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

అయితే సెన్సార్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో 'జన నాయగణ్' అసలు ఎప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్న టైంలో జూన్ 19న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుందని టాక్ బయటకొచ్చింది. డిస్ట్రిక్ట్ టికెట్ బుకింగ్ సైట్‌లో ఈ తేదీనే ఉండటంతో ఇదే ఫైనల్ అని అనుకుంటున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు రిలీజ్ అయితే తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం థియేటర్ల దగ్గర సందడి వాతావరణం గ్యారంటీ. మరి ఇదెంత వరకు నిజమవుతుందనేది చూడాలి?

విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో చేసిన 'జన నాయగణ్'.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. తొలుత ఇది నిజమా కాదా అని అంతా అనుకున్నారు గానీ తమిళనాడు ఎన్నికల రిలీజ్ టైంలో మూవీ పైరసీ ప్రింట్ లీక్ కావడంతో రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. 

(ఇదీ చదవండి: ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ)

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)