Breaking News

ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణ వృథా

Published on Thu, 05/21/2026 - 23:41

జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్‌ప్రైజ్‌ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్‌ 'గాడ్ ఆఫ్ వార్‌'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్‌ హ్యాండిల్‌లో మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు.  

ఈ పరిణామంతో తారక్‌ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్‌' ప్రాజెక్ట్‌ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్‌మీడియా హ్యాండిల్‌ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్‌' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.  ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్‌' ప్రాజెక్ట్‌ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్‌ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు.
 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)