అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి ప్లాన్ ఛేంజ్..!
Published on Wed, 05/13/2026 - 16:39
మహేశ్ బాబు- వారణాసి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
అయితే భారీ యాక్షన్ సీన్స్‌ను కోసం హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్‌పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. అందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల అవసరం కావడంతో జలమండలికి లేఖ రాశారు. వేసవికాలం కావడంతో అంత నీరు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి వారణాసి టీమ్‌కు షాకిచ్చారు. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఈ సీన్స్ కోసం ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ వారణాసికి ప్లాన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ వారణాసిలోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.
Tags : 1