Breaking News

ఇక నుంచి 'పీసీఓఎస్‌' కాదు 'పీఎంఓఎస్‌'

Published on Wed, 05/13/2026 - 13:28

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది.  దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్‌ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్‌గా పేరు మార్పు. 

దేని గురించి ఈ పేరు మార్పు..
ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్‌ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు.  అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.

ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..

పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయి

మెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉంది

ఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది

సిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుంది

ఈ పేరు మార్పు  లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్‌లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

PMOS అంటే..?
PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,

లక్షణాలు:
క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడం
అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు
మొటిమలు,ముఖంపై రోమాలు పెరగడం
బరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బంది
ఇన్సులిన్ నిరోధకత
సంతానోత్పత్తి సవాళ్లు
కొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటం

ఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..
టైప్ 2 మధుమేహం
అధిక రక్తపోటు
గుండె జబ్బులు
ఫ్యాటీ లివర్ వ్యాధి
నిద్రలేమి
డిప్రెషన్, ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ సమస్యకు గల కారణాలు:
నిశ్చల జీవనశైలి
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం
పెరుగుతున్న ఊబకాయం
సరిగా నిద్రపోకపోవడం
ఒత్తిడి
వంశపారంపర్య కారణాలు

రోగ నిర్ధారణను మెరుగుపరుస్తుంది
ఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. 

ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

(చదవండి: ఎవరీ లారెన్‌ వాసర్‌..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..)

 

#

Tags : 1

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)