Breaking News

గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్‌ కేన్సర్‌..!చివరికి..

Published on Tue, 05/12/2026 - 15:34

గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క​ తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్‌ స్టేజ్‌లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్‌ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.

ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్‌ కేన్సర్‌ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్‌ లింఫోబ్లాస్లిక్‌ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్‌కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. 

ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. 

పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్‌ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్‌ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.

అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..
ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.

లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.

చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. 

(చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు)
 

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)