Breaking News

త్రిష- విజయ్‌ల పెళ్లెప్పుడు?.. తెగ వెతికేస్తోన్న నెటిజన్స్..!

Published on Thu, 05/07/2026 - 13:41

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు దళపతి విజయ్‌. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని(108 స్థానాలు) నమోదు చేసింది. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం విజయ్‌ ఫోకస్‌ అంతా మేజిక్‌ ఫిగర్‌(118)కి కావాల్సిన సభ్యులను పోగు చేయడంపైనే పెట్టాడు. గవర్నర్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ రోజే విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి నెటిజన్స్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ త్రిషతో పెళ్లి ఎప్పుడు? వారిద్దరి లవ్‌ స్టోరీ ఎలా మొదలైంది? వయసు తేడా ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే విజయ్‌ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఓ నటితో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట ట్రెండ్‌ అయింది. విజయ్‌-త్రిషలు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఎక్కువైయ్యాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.

అప్పటి నుంచి విజయ్‌, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిష బర్త్‌డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్‌ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్‌ మరింత ఎక్కువయ్యాయి. విజయ్‌ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. మరికొంతమంది అయితే.. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టిపెడతాడని, ఐదారు నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. 

ఏదేమైనా పెళ్లి మాత్రం చేసుకోవడం పక్కా అని తేలడంతో.. అందరూ విజయ్‌-త్రిషల వయసుపై గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంత అనేది చాలా మంది గూగుల్‌ని అడిగి తెలుసుకుంటున్నారు.  విజయ్‌ 1974 జూన్ 22న జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం 51 ఏళ్లు.  త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ తేడా ఉంది. 

విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెరపై వీరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు రావడమే కానీ.. అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటించలేదు.

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)