Breaking News

విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!

Published on Tue, 05/05/2026 - 14:53

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ‍ట్రెండింగ్‌లో త్రిష)

తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ‍ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్‌కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)

Videos

ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..

ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!

సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్

హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు

TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం

విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?

ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK

విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!

ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం

Photos

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి (ఫొటోలు)

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)