ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్
Breaking News
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
Published on Tue, 05/05/2026 - 11:29
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్‌నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్‌డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.
సెట్‌లో విజయ్‌తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్‌నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్‌నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్‌లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు.
ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు.
51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్‌కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్‌లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్‌కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
ఆయన సెట్‌లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్‌ని స్పెషల్‌గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్‌గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్‌నే నిదర్శనమని అన్నారు.
(చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..)
Tags : 1