Breaking News

'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

Published on Mon, 05/04/2026 - 20:11

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..

కియోసాకి హెచ్చరిక!
ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.

కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.

జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..
జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు.

 
 

ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.

జీతంపై ఆధారపడటం వల్ల
మరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.

పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాం
ప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

Videos

ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు

చెన్నైలోని తల్లిదండ్రుల నివాసంలో TVK విజయ్ దృశ్యాలు

పవర్ పోయింది.. దీదీ పాలనకు చరమగీతం..

Axis My India చెప్పిందే నిజమైంది.. విజయ్ విజయ దుందుభి

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు

MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి

విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న

సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం

రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..

పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం

Photos

+5

ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)