ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు
Breaking News
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
Published on Mon, 05/04/2026 - 18:31
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.
చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.
ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
Tags : 1