Breaking News

మార్కెట్‌లో జూదం ఆడుతున్నారు!

Published on Mon, 05/04/2026 - 11:41

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు, ‘ఓరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలువబడే వారెన్ బఫెట్ మదుపరులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత పెట్టుబడిదారులు సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి ప్రమాదకరమైన జూదంలో మునిగి తేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

స్టాక్ మార్కెట్లు ‘అతి తక్కువ సమయంలో ఊహించని ధనవంతులు కావాలనే జూదగాళ్ల అడ్డాగా’ మారిందని బఫెట్ అన్నారు. నేటి మార్కెట్లలో పెట్టుబడి, ఊహాజనిత (స్పెక్యులేటివ్‌) కార్యకలాపాల మధ్య తేడా కనుమరుగవుతోందని ఆయన విశ్లేషించారు. ‘ఎవరైనా వన్-డే ఆప్షన్లతో ట్రేడింగ్ చేస్తుంటే అది పెట్టుబడి కాదు, కనీసం ఊహాజనితం కూడా కాదు.. అది పూర్తిగా జూదం లాంటిది. చరిత్రలో ఇంతటి తీవ్రమైన మానసిక స్థితి మదుపరుల్లో ఎప్పుడూ చూడలేదు’ అని బఫెట్ స్పష్టం చేశారు.

సైనిక చర్యల సమాచారంతో..

మార్కెట్లలో జరుగుతున్న ఈ అనాలోచిత ధోరణికి బఫెట్ ఒక సంచలన ఉదాహరణను ప్రస్తావించారు. వెనిజులాలో సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్లలో ఒక అమెరికన్ సైనికుడు సుమారు 4,00,000 డాలర్లు (రూ.3.3 కోట్లు పైగా) గడించాడనే ఆరోపణలతో జరుగుతున్న విచారణను ఆయన గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలు మార్కెట్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయన్నారు. స్వల్ప కాలపు లాభాల కోసం అక్రమ మార్గాలను ఎంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.

నాయకత్వ మార్పు

ఈ సమావేశం బెర్క్‌షైర్ హాత్వేలో కొత్త శకాన్ని ఆవిష్కరించింది. గ్రెగ్ అబెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన మొదటి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. కృత్రిమ మేధ(ఏఐ) గురించి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రయోజనం లేని ఏ సాంకేతికతను సంస్థ గుడ్డిగా అనుసరించదన్నారు. కేవలం వ్యాపార విలువను పెంచే అప్లికేషన్లపైనే దృష్టి సారిస్తామని అబెల్ స్పష్టం చేశారు. రైల్వే, బీమా రంగాల్లో సంస్థ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన

Videos

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై NV. సుభాష్

విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)