Breaking News

'టాలీవుడ్‌లో కుల పిచ్చి ఎక్కువ'.. మహేశ్ విట్టా షాకింగ్ కామెంట్స్

Published on Sun, 05/03/2026 - 11:12

యూట్యూబర్‌ కెరీర్‌ స్టార్ట్ చేసిన టాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడిన కొద్దిమందిలో మహేశ్ విట్టా ఒకరు. చాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్‌ల ద్వారా వినోదాన్ని పంచిన మహేశ్.. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్‌ సినిమాల్లో కమెడియన్‌గా తన నటనతో ప్రత్యేక ముద్రవేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూ హాజరైన మహేశ్ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ప్రస్తావించారు. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

సినీ ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువని సంచలన కామెంట్స్ చేశారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత నాకు రావాల్సిన రోల్స్‌ను చివరి నిమిషంలో వేరేవాళ్లకు ఇచ్చేవారని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా ఆపేసే వారని తెలిపారు. ఇక్కడ టాలెంట్‌ కంటే.. కులం ముఖ్యమని నాకు అర్థమైందన్నారు. అలా నాకు ఎన్నో అవకాశాలు రాకుండా పోయాయని మహేశ్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ..' నేను చాలా పాత్రలకు ఆడిషన్లు ఇచ్చేవాడిని. నన్ను సెలెక్ట్ కూడా చేసేవారు. షూటింగ్ తేదీలు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్ చేయడం ఆపేయడం.. నా స్థానంలో మరో నటుడిని తీసుకోవడం జరిగేది. మొదట్లో ఇదంతా నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయంపై ఆరా తీశా. నా స్థానంలో వచ్చిన వ్యక్తి నిర్మాత, దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడేనని తెలిసి షాక్ అయ్యా. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం క్యాస్ట్ కారణంగా నాకు అవకాశాలు దక్కకపోవడం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది' అని అన్నారు.

కాగా.. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్‌లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు.  బిగ్‌బాస్ షోలోనూ రెండుసార్లు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సినిమాలు చేస్తూనే శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
 

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)