Breaking News

అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది : శ్రీలీల

Published on Sun, 05/03/2026 - 08:11

పెళ్లిసందడి అనే చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన శాండిల్‌వుడ్‌ బ్యూటీ శ్రీలీల. వైద్య విద్య చదివి కథానాయకిగా మారిన నటీమణుల్లో ఈమె ఒకరు. తొలి చిత్రంతోనే అభిమానులను, సినీ ప్రముఖులను బాగా ఆకట్టుకున్న ఈమె ఎదుగుదల అనూహ్యంగానే జరిగింది. తెలుగులో ప్రముఖ కథానాయకులతో నటించి తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకున్న శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి సారించారనే చెప్పాలి. 

ఇటీవల తెలుగులో నటించిన రాబిన్‌హుడ్, మాస్‌జాతర, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ వంటి చిత్రాలు వరుసగా నిరాశ పరచడంతో అక్కడ అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. శ్రీలీల తమిళంలో నటించిన తొలి చిత్రం పరాశక్తి. ఇది మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నటుడు ధనుష్‌ జంటగా ఆయన 55వ చిత్రంలో నటిస్తున్నారు. 

అదేవిధంగా ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. డాన్సులో ఇరగదీసే శ్రీలీల ధనుష్‌కు జంటగా నటించే చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ బలమైన సెంటిమెంట్‌ సన్నివేశాలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించాలనే ఆశలు వ్యక్తం చేశారు. 

అలాంటి చిత్రాలు నటిగా తనలోని నటనను చూపిస్తాయని భావిస్తున్నానన్నారు. అదేవిధంగా వైవిధ్య భరిత కథా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానన్నారు .అలాంటి చిత్రాలు తనను నెక్ట్స్‌ లెవెల్‌ తీసుకెళ్తాయని నమ్ముతున్నాను అని శ్రీలీల పేర్కొన్నారు.  

Videos

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

నడిపించేది మొత్తం మంగ్లీ..! డబ్బులే డబ్బులు అని నమ్మించి ఇలా చేసింది

బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

Photos

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)