Breaking News

బట్టలు ఆరేసాక, సడెన్‌గా వర్షం వస్తే : అమ్మడి ఐడియా అదుర్స్‌!

Published on Sat, 05/02/2026 - 15:38

బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో  ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్‌  బెడ్స్‌మీదో  ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా  సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్‌ మెషీన్‌లోనే అనుకోండి) ఆరేసినపుడు,  ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది.  అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.

చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప‍్లేస్‌  దొరకనపుడు బట్టల రాక్‌లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో,  పడకగదుల్లోనూ బట్టల రాక్‌లు అమర్చుకుంటాం. ఇంకా వాష్‌స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్‌ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట  తీగల మీద ఆరేసిన బట్టల్ని  వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం  లేకుండానే  ఒక వినూత్న టెక్నిక్‌ను వాడింది. దీనికి జస్ట్‌ అలా వీల్‌ అమర్చిన స్టాండ్‌ను లోపలికి  జరిపింది. అంతే  ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే  సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో  మహిళ.

నెటిజన్ల  స్పందన 
గుడ్‌ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్‌, స్పేస్‌ వేస్ట్‌ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్‌లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్‌ చేయడం గమనార్హం. 
 

ఇదీ చదవండి: షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

 

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)