Breaking News

స్టార్ హీరో సినిమాకు మోక్షం.. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత..!

Published on Thu, 04/30/2026 - 19:40

కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ధృవనక్షత్రం రిలీజ్‌కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన  లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది.

దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌  యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్‌ మీనన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.  ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది.

ఆ తర్వాత  కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇ‍ప్పటికే పలుసార్లు పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్‌, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. 
 

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)