Breaking News

విమానం గాల్లో ఉండగానే ప్రసవం..!

Published on Tue, 04/28/2026 - 11:31

విమానం గాల్లో ఉండగానే ప్రసవించడం అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇలాంటి పరిస్థితిని అత్యంత అరుదైన వైద్య పరిస్థితిగా పేర్కొంటారు కూడా. అదృష్టవశాత్తు ఆ విమానంలో ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు ఉండటం వల్ల ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయవంతంగా ప్రసవించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఈ అరుదైన ఘటన డెల్టా ఫ్లైట్ 478 అట్లాంటా నుంచి పోర్ట్‌ల్యాండ్‌కు ప్రయాణిస్తుండగా  చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పోర్ట్‌ల్యాండ్‌కు ఐదు గంటల పాటు సాగిన విమాన ప్రయాణంలో ఒక మహిళ గాలిలోనే ప్రసవించింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వచ్చిన ప్రాథమిక అత్యవసర కాల్ ప్రకారం, సదరు మహిళ సుమారు 35 నిమిషాలుగా ప్రసవ నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ఫ్లైట్‌ అటెండెంట్లతో సహా మొత్తం 153 మంది ప్రయాణికులు ఉన్నారు. 

అదృష్టవశాత్తూ, ప్రయాణికులలో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. వారు వెంటనే రంగంలోకి దిగి, విమానం ల్యాండ్ కావడానికి ముందే శిశువును సురక్షితంగా ప్రసవింపజేయడానికి ఫ్లైట్ అటెండెంట్లతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత శిశువు బొడ్డు తాడుని కట్‌ చేసి పాపకు చుట్టగానే విమానం కిందకు దిగుతుంది. నిజానికి వాళ్లు ఎలాంటి సీటు బెల్టులు పెట్టుకోకముందే కిందకు ల్యాండ్‌ అవుతోంది విమానం. 

వాళ్లు సీటును పట్టుకుని నిల్చున్నారు. ఆ తర్వాత పాపను తల్లికి తిరిగి ఇచ్చేసి విమానాన్ని రన్‌వేపై ముందుకు పోనిచ్చారు. దాంతో విమానంలో ఉన్నవారంతా ఆ తల్లిని చూసి హమ్మయ్యా..! తల్లిబిడ్డ సురక్షితంగా ఉన్నారంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా విమానం అత్యవసరంగా ల్యాండ్‌ కావడానికి 30 నిమిషాల ముందే చకచక జరిగిపోయింది. కాగా, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, విమానంలోనే పాప పుట్టిందని సదరు విమానాయన సంస్థ ప్రకటించింది.

(చదవండి: 144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్‌ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!)

 

 

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)