Breaking News

ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్‌ అవ్వాల్సిందే!

Published on Sat, 04/25/2026 - 15:40

ఎన్నో పర్యాటనలకు వెళ్తుంటాం. కొన్ని ప్రదేశాలు, అక్కడ చూసిన బ్యూటీఫుల్‌ స్పాట్‌లు మదిలో అలా నిలిచిపోతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ పర్యాటక ప్రదేశంలోని బేకరీ స్టాల్‌. ఇక్కడకు వెళ్తే..ఎవ్వరైన నిశబ్దంగా మారి..చిరునవ్వులు చిందిస్తుంటారు. ఎందుకంటే..

నేపాల్‌లో ఒక బదిర దంపతులు నడుపుతున్న బేకరీ ఇది. అక్కడ నేపాల్‌లో అందమైన ప్రదేశాలన్ని తిలకించాక లాంట్‌టాంగ్‌ లోయ వద్దకు చేరుకునే యాత్రికులకు మధుమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఈ బేకరి. అక్కడే ఈ బదిర దంపడుతు 'పీస్‌ఫుల్ బేకరీ', ఉంది. పర్వతాల మధ్య నెలకొన్న ఈ బేకరీ బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌ కంటే ఇంత అందమైన జ్ఞాపకంగా మార్చిన దంపతులకే క్రెడిట్‌ మొత్తం ఇవ్వలి. సైగలతో మాట్లాడే ఆతిధ్యం మనల్ని కట్టిపడేయేగా, అక్కడ మనం చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. ఎక్కడకు వెళ్లినా ఇంతలా నవ్వే ఛాన్స్‌ లేదన్నట్లుగా ఆ దంపతులు తమ ఆప్యాయత, ప్రేమతో నవ్విస్తుంటారు. 

ఈ బేకరీలో ఆపిల్‌ మోమో(ఆపిల్‌ పైస్‌) అత్యంత రుచికరమైన వంటకంగా గూగుల్‌ రివ్యూలు చెబుతున్నాయి. చాలామంది సందర్శకులు పర్వత ట్రెక్కింగ్‌ తర్వాత తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈ వంటకాన్ని రుచిచూసే ‍ప్రయత్నం చేస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యాక దీనికి మరింత క్రేజ్‌ వచ్చింది. 

ఎలా చేరుకోవాలంటే..
నేపాల్‌లో ఈ బేకరీని సందర్శించాలనుకుంటే.. కాఠ్మండు నుంచి ఏడు గంటల బస్సు ప్రయాణం, ఆ తర్వాత పర్వతాలలో రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడకు వెళ్లడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. రైలు పట్టాల పక్కన ఉన్న ఒక మనోహరమైన చిన్న ప్రదేశం వద్ద ఈ బేకరీ ఉంటుంది. 

వారు సైగ భాషలోనే అద్భుతమైన ఆతిథ్యం అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అస్సలు మిస్‌ కాకండి మరి..అయినా ఏ పర్యాటకంలోనైనా అత్యంత మధురమైన స్మృతులు అక్కడ కలిసిన వ్యక్తులేనని ఈ బేకరీ సందర్శన గుర్తు చేస్తుంది అని చెబుతున్నారు చాలామంది పర్యాటకులు.

 

(చదవండి: పెరుగు అన్నం vs లెమన్‌ రైస్‌: ఈ సమ్మర్‌లో డయాబెటిస్‌ రోగులకు ఏది మంచిదంటే..)
 

#

Tags : 1

Videos

ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..

టీడీపీ బాంబుల పార్టీనా..గునపం పార్టీనా ?

గుమ్మడి సంధ్యారాణికి బిగ్ షాక్

పెళ్లైన మహిళలు ఏం సెర్చ్ చేస్తారో తెలుసుకుంటే భర్తలు షాక్ అవుతారు..!

టోల్ సిబ్బంది పొట్టుపొట్టు కొట్టారు టీడీపీ ఎమ్మెల్యేతో మాములుగా ఉండదు

హైదరాబాద్ ఆస్పత్రులతో జాగ్రత్త కేంద్రం సంచలన రిపోర్ట్

Tadepalli: దళిత గళ సమ్మేళనం

ఇండియాలో మొదలెన మైఖేల్ జాక్సన్ మూవీ ఫీవర్..

YS Jagan: త్వరగా కోలుకోవాలి

కొలికపూడిపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Photos

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)

+5

30 నిమిషాల డీల్‌.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్‌ చద్దా జోడి (ఫొటోలు)

+5

గ్లోబల్ స్పా అవార్డ్స్ వేడుకలో గ్లామర్‌ క్వీన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)