Breaking News

తారలెందరో...తాగుబోతులు కొందరే..

Published on Thu, 04/23/2026 - 12:21

సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం  చాలా సార్లు ‘‘సోషల్‌ ఫన్‌’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్‌ల మధ్య రిలాక్స్‌ కావడానికి లేదా ఫ్రెండ్స్‌తో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత  పలు సందర్భాల్లో కంట్రోల్‌ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్‌ జాన్వీకపూర్‌ అభిప్రాయపడ్డారు. అయితే,  ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్‌లో బ్యాలెన్స్‌ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్‌. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్‌ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది.

 ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్‌ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్‌ ద రాక్స్‌ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని  చేపట్టారు.

ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని  తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు.  సినీ ప్రముఖుల్లో  కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు.  

సీసా వదిలేశాకే....సీన్‌ మారింది...
‘‘బాటిల్‌ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్‌. ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త  వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే  కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.

తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్‌ఎయిడ్‌’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్‌ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్‌గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.

నమ్మించి నాశనం చేస్తుంది
‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది.  ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది,  ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం  అవుతున్నాం అనేది తెలుస్తుంది.  అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్‌ గేవ్‌ మి  ఎ న్యూ లైఫ్‌ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.

విస్కీ నుంచి విముక్తి...
‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్‌. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్‌... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి  దాన్ని పూర్తిగా వదిలేయాలని  నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా  నైట్‌ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు.

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)