పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
Breaking News
జోర్దార్ సుజాతకు మా సభ్యత్వం.. మంచు విష్ణు అందజేత
Published on Tue, 04/21/2026 - 20:06
తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యాంకర్ జోర్దార్ సుజాత. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని ఫేమస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ ప్రేమలో పడిన సుజాత.. పెళ్లితో బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జోర్దార్ సుజాతకు మా సభ్యత్వం దక్కింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా అసోసియేషన్‌లో సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ఇంతవరకు వచ్చానంటే మీ అందరి ఆశీర్వాదం, బలమేనని తెలిపింది. ఇకముందు కూడా ఇలాగే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు సభ్యత్వ గుర్తింపు కార్డ్ అందజేశారు.
Tags : 1