భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
Breaking News
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్‌టెల్
Published on Mon, 04/20/2026 - 11:22
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్‌గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.
ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్‌లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్‌టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్‌కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.
సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్‌టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
Tags : 1