ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
Breaking News
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా
Published on Sun, 04/19/2026 - 18:36
తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వరస షాకులిస్తోంది. చాన్నాళ్లుగా పెద్దగా బయట కనిపించని ఈమె.. 20 రోజల క్రితం తనకు పెళ్లయి ఏడాది పూర్తయిందని చెబుతూ భర్త ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటో చేసింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా.. భర్త ఎవరంటే?)
విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. రెండు వారాలే ఈ షోలో ఉన్నప్పటికీ తోటి కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖితో స్నేహం కుదిరింది. షో అయిపోయి దాదాపు ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో తమన్నా ఒకరు.
అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. ఈమె నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గాలో మొక్కుకున్నారు. అమ్మాయి లక్షణాలతో ఉన్న అబ్బాయి పుట్టాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబై వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని తమన్నా సింహాద్రిగా మారింది.
ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అలా 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో, 2024లో పవన్ కల్యాణ్‌పై పిఠాపురంలో పోటీగా నిలబడింది. కానీ ఓడిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నానని, స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అని చెప్పేసరికి అసలు ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)
Tags : 1