Breaking News

‘వార్‌’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!

Published on Sun, 04/19/2026 - 09:17

అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్‌లో కూడా. ఆ వార్‌ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్‌... రేలంగి అంకుల్‌ సార్‌. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్‌’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. 

‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్‌. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... 

‘‘ఈ ట్రంప్‌ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్‌. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్‌ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్‌తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. 

‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్‌జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్‌కు ఇంటికి గ్యాసు సిలెండర్‌ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద...  క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్‌కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. 

ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి  చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. 

బజ్జీల బండ్లకూ, టిఫెన్‌ హోటళ్లకు బ్లాకులో తప్ప  కమర్షియల్‌ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్‌ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్‌... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్‌ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. 

అన్నట్టొరేయ్‌... ఈ వార్‌ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్‌ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు.  

అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్‌ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్‌ పూనాడు. అప్పుడా రావు రమేశ్‌ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... 

‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!
– యాసీన్‌

 

 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)