Breaking News

మహావతార్‌ నరసింహ సీక్వెల్‌ టైటిల్‌ ఫిక్స్‌

Published on Sun, 04/19/2026 - 07:12

దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ తెరకెక్కించిన యానిమేటెడ్‌ చిత్రం ‘మహావతార్‌: నరసింహ’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయింది. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (hombale films) నిర్మించిన ఈ చిత్రం  ఏకంగా రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.  యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేసింది.

యానిమేషన్‌ చిత్రాల పరంగా అరుదైన రికార్డు నెలకొల్పిన ‘మహావతార్‌ నరసింహ’కు కొనసాగింపుగా పలు చిత్రాలు రానున్నాయి. ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు వస్తాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో విష్ణుమూర్తి   దశావతారాలకు సంబంధించిన కథ ఉంటుందన్నారు. ఈ యూనివర్స్ నుండి రెండవ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

ఈ చిత్ర టైటిల్‌ను నేడు ఆదివారం ఉదయం 11:22 గంటలకు వెల్లడిస్తారు.  (మహావతార్‌ పరశురామ్‌) టైటిల్‌ ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. మొదటి భాగం వరాహ, నరసింహ అవతారాలను చూపించగా, తదుపరి చిత్రం పరశురాముడు లేదా విష్ణుమూర్తి అవతారం చుట్టూ తిరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ 3D-యానిమేటెడ్ చిత్రాల సిరీస్‌ను అశ్విన్ కుమార్ 12 సంవత్సరాల ప్రణాళికతో రూపొందించారు. ఆధునిక చిత్ర నిర్మాణ పద్ధతులతో ప్రతి అవతారానికి జీవం పోస్తూ, ఈ చిత్రాలన్నీ 2025 నుండి 2037 మధ్య విడుదల కానున్నాయి.
 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)