Breaking News

300 సినిమాలు చేశా.. నాలో ఉన్న లోపం ఏంటి?.. : సుమన్‌ శెట్టి ఎమోషనల్‌

Published on Sat, 04/18/2026 - 16:55

ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ సుమన్‌ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్‌ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్‌ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్‌ కూడా దొరకనంత బిజీ కమెడియన్‌ అయిపోయాడు. 

దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్‌.. సడెన్‌గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్‌బాస్‌ షోతో మళ్లీ సుమన్‌ శెట్టి ఫామ్‌లోకి వచ్చాడు. బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్‌లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తర్వాత ఆయన కెరీర్‌ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 

300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్‌ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన  ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్‌లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. 

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)