Breaking News

బిగ్ బాస్‌ చీకటి నిజం.. ఫోటోలు షేర్‌ చేసి రూ. 2కోట్లు డిమాండ్‌

Published on Sat, 04/18/2026 - 08:30

కొద్దిరోజుల క్రితమే బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్‌ ముగిసింది. విన్నర్‌గా సినీ నటి తన్వీ కొల్టే నిలిచారు. అయితే, ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న మోడల్‌, నటి సోనాలి రౌత్ బిగ్‌ బాస్‌ టీమ్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోరినట్లు సమాచారం. షోలో ఉన్న సమయంలో తాను తీవ్రమైన మానసిక, శారీరక క్షోభకు గురయ్యానని ఆమె ఆరోపించారు. అక్కడి వాతావరణం కారణంగా తనకు చర్మ సంబంధిత వ్యాధి (తామర) సోకిందని తెలిపింది. ఈ కారణంగానే తాను రెండోవారంలోనే  షో నుండి నిష్క్రమించానని తెలిపింది. షో నుంచి తాను బటయకు వచ్చి సుమారు 3నెలలు అవుతున్నా సరే ఆ సమస్య తనను ఇప్పటికీ వేధిస్తూనే ఉందని ఆమె పేర్కొంది.

మరాఠి నటి సోనాలి రౌత్‌  ఒక వీడియోను పంచుకుంటూ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. "రియాలిటీ షో అంటే మా ప్రాణాలను పణంగా పెట్టడం కాదు. నిర్వాహుకులపై నమ్మకంతోనే బిగ్ బాస్ మరాఠీ 6 లోకి నేను ప్రవేశించాను. కానీ, అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. మమ్మల్ని అపరిశుభ్రత వాతావరణంలోకి నెట్టారు. హౌస్‌లో శుభ్రత లేకపోవడం వల్ల నాకు తామర వంటి అంటువ్యాధి సోకింది.  వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయి. వాటితోనే  కలిసి జీవించాం. ఆ పీడకల గురించి తలచుకుంటే భయమేస్తుంది.  ఇకనైనా బిగ్‌బాస్‌ టీమ్‌ నుంచి జవాబుదారీతనం రావాలి. 

మా ఆడంబరాల వెనుక ఆకలి, నిద్రలేమి, సున్నా పరిశుభ్రత అనే చీకటి నిజం ఉంది. ఇతరులు వాడిన టవల్స్, రేజర్‌ల వంటి ప్రాథమిక వస్తువులను కూడా షేర్‌ చేసుకోవాల్సి వచ్చింది. హౌస్‌లో  టవల్స్‌, బెడ్ షీట్లు, నాప్‌కిన్‌ల కొరత కారణంగా అపరిశుభ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి.  కంటెస్టెంట్స్‌ ఒకరి టవల్స్, బెడ్ షీట్లను మరొకరు వాడుకునేవారు, వాటిని రోజుల తరబడి మార్చేవారు కాదు.  దీని వల్ల నాకు చర్మ వ్యాధికి దారితీసింది. దీంతో షో నుండి రెండో వారంలోనే నేను బయటకు వచ్చేశాను. ఇప్పటికీ కూడా ఆ సమస్య నన్ను వేధిస్తూనే ఉంది.  

వీకెండ్ కా వార్ సమయంలో ఎండెమోల్ ప్రొడక్షన్ నుండి వచ్చిన ఆహారంలో బొద్దింకలు కూడా కనిపించాయి. బిగ్‌బాస్‌ షోలో పనిష్మెంట్‌ పేరుతో  17 మంది కంటెస్టెంట్స్‌కు కేవలం ఒకే వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోమన్నారు. అందులోనే సిగరెట్స్‌ తాగడం ఆపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం జరిగింది. మిగిలిపోయిన ఆహారం, చికెన్, గుడ్డు పెంకులు ఓపెన్‌ ప్లేస్‌లో వేయడంతో ఎలుకలు బెడదు ఎక్కవైంది. ఇలా పలు కారణాలతో నేను అనారోగ్యానికి గురైయాను. నా పరిస్థితి విషమించడం వల్లే హౌస్‌ నుంచి రెండోవారంలోనే వచ్చేశాను. నేను బిగ్‌బాస్‌ టీమ్‌ను నమ్మాను. కానీ, నా ఆరోగ్యం, శ్రేయస్సును దెబ్బతీశారు. ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను.' అని ఆమె అన్నారు. అయితే,సోనాలి ఆరోపణలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు.

సోనాలి రౌత్.. ఒక  మోడల్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొందింది. ఆమె హిందీ బిగ్‌బాస్‌ (సీజన్ 8)లో పాల్గొంది. ఈ షో ద్వారా ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. 2010లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా గుర్తింపు పొందింది. మోడలింగ్‌తో పాటు కొన్ని టీవీ షోలలో కూడా కనిపించిన ఆమె పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది.
 

Videos

వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం

డయాబెటిస్ ఉన్నా హాయిగా అన్నం తినొచ్చు! అన్నం ఇలా వండండి

లోక్ సభలో రచ్చ రచ్చ.. డీలిమిటేషన్ తో సౌత్ కి నిజంగా నష్టమేనా

ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?

సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు

హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్

ఇటలీ ప్రధానికి ముద్దు పెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

భార్య ఓవర్ యాక్షన్ తో భర్తకు కష్టాలు.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు..

ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!

లోకేష్ వేస్ట్.. క్లాస్ రూమ్ లో మందు.. మద్యానికి బానిసగా గురుకుల విద్యార్థులు

Photos

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)