అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
Breaking News
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
Published on Fri, 04/17/2026 - 13:48
తెలుగులో చాలా సీరియల్స్ వచ్చినప్పటికీ పదేళ్ల క్రితం 'వరూధిని పరిణయం' ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రవికృష్ణ, చందన శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రవికృష్ణ ప్రస్తుతం సినిమాలు చేస్తుండగా.. చందన మాత్రం పెళ్లి చేసుకుని నటనకు వీడ్కోలు చెప్పేసింది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చందన శెట్టి.. 2013 నుంచి 2016 వరకు ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మన దగ్గర ఇది తప్పితే మరో సీరియల్ చేయలేదు కానీ తెలుగు, కన్నడలో పలు సినిమాలు చేసింది గానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి 2024 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుంది.
ఈమె భర్త అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత భర్తతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చిన చందన.. తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా భర్త తనకు ప్రపోజ్ చేసిన ఫొటోతో పాటు బేబీ బంప్‌ని అతడు ముద్దాడుతున్న ఫొటోలని పంచుకుంది. దీంతో తోటీ సీరియల్ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)
Tags : 1