మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?
Breaking News
'జన నాయగన్' లీక్ కేసులో అసలు దొంగ ఎవరంటే..
Published on Fri, 04/17/2026 - 07:35
విజయ్ నటించిన 'జననాయగన్' మూవీ లీక్‌తో సంబంధం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్న వ్యక్తే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్న సదరు వ్యక్తి తరచుగా ‘జన నాయగన్’ మూవీ ఎడిటింగ్ జరిగే స్టూడియోలోకి వెళ్లేవాడు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన కొంత డేటాను దొంగలించి.. దానినే సినిమాగా మార్చాడు. ఆపై తనకు తెలిసిన వారితో ఆ పుటేజీని పంచుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ ఆన్‌లైన్‌లో కనిపించాయి. పూర్తి ఆధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి రిమాండ్ విధించింది.
'జననాయగన్' మూవీ లీక్ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆపై కోయంబత్తూర్ లోకల్ ఛానల్‌లో మూవీ ప్రసారం కావడంతో ఆ ఛానల్ యజమానిని కూడా పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం ప్రేక్షకులకు ఒ క విజ్ఞప్తి చేసింది. అనధికారికంగా ఇలాంటి వీడియోలను ఎవరితోనైనా షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, మూవీ లీక్ కావడం ఆపై సెన్సార్ చిక్కుల వల్ల విడదల అంశంలో జాప్యం ఏర్పడటంతో భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది.
Tags : 1