"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
Published on Thu, 04/16/2026 - 21:10
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.
ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్..
దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
180(మూవీ)- ఏప్రిల్ 17
రూమ్‌మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17
ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17
ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17
లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17
బెబెఫిన్‌సింగ్-ఎలాంగ్‌మూవీ ఇన్ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19
అమెజాన్ ప్రైమ్
మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17
ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
జీ5..
అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17
ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17
ఆహా..
పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
బుక్ మై షో
ది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
హెచ్‌బీవో మ్యాక్స్..
డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
హులు..
షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
లయన్స్ గేట్ ప్లే
గుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
Tags : 1