Breaking News

OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లరి సినిమా

Published on Thu, 04/16/2026 - 19:07

భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.

అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. 

ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.
- హరికృష్ణ ఇంటూరు

 

Videos

"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్

BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు

వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్

హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

LIVE:లష్కరే టాప్‌ కమాండర్‌పై కాల్పులు...

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

Photos

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)