Breaking News

మామ్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..

Published on Thu, 04/16/2026 - 13:00

బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్‌ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్‌పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్‌ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్‌లాస్‌​ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్‌ కూడా.

ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి షేర్‌ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్‌ డైట్‌ పాటించలేదని అన్నారు.

ప్రోటీన్‌ తప్పనిసరిగా..
ఆహారం, ప్రోటీన్‌ సప్లిమెంట్లు తన లైఫ్‌లో పెద్ద గేమ్‌ ఛేంజర్‌ అని అంటోంది. ప్రోటీన్‌ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్‌ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.

ఇంటి భోజనం
ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్‌ఫాంల నుంచి ఆర్డర్‌ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్‌ చేయడం ముఖ్యం.

ఎక్కువగా నీరు తాగడం..
డీహైడ్రేషన్‌ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.

అలాగని స్వీట్లకు దూరం కాలేదట..
ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్‌ ప్రకారం తినేదాన్ని అంటోంది. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.  ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: చలువ చేసే మారేడు పానకం..!)
 

Videos

"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్

BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు

వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్

హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

LIVE:లష్కరే టాప్‌ కమాండర్‌పై కాల్పులు...

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

Photos

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)