ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?

Published on Wed, 04/15/2026 - 17:19

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్‌ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్‌ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్‌ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్‌ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు.  ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.  

తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్‌ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్‌ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్‌ ట్యూబ్స్‌), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. 

జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్‌సీలు 8, పీహెచ్‌సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్‌గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. 

నిర్లక్ష్యం చేస్తే  
ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్‌ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. 

పెరుగుదలకు ప్రధాన కారణాలు 
గర్భాశయ నాళాల్లో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్‌ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్‌ సెక్స్‌ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్‌ చెకప్‌లు తప్పనిసరి.  

ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటే! 
గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్‌ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్‌ఫెక్షన్, ఆఫరేషన్‌ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్‌ చేసినప్పుడే తెలుస్తుంది.  

అజాగ్రత్త వద్దు  
అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్‌ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్‌ఫెక్షన్, ఆఫరేషన్‌ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి.  
– షాలిని, గైనిక్‌ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు  

వైద్యులను సంప్రదించాలి  
నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి.  
– ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు   

(చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్‌ అందుకుంది..!)

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)