చలువ చేసే మారేడు పానకం..!

Published on Wed, 04/15/2026 - 13:57

మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే  చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు  ఏ షెర్బత్‌లు, జ్యూస్‌లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. 

వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..

పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. 

ఆరోగ్య ప్రయోజనాలు..

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.

వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. 

మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. 

మొటిమలను నివారిస్తుంది. 

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కేన్సర్‌ బారినపడకుండా రక్షిస్తుంది. 

బాడీని హైడ్రేటెడ్‌ ఉంచుతుంది

బరువుని అదుపులో ఉంచుతుంది. 

అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్‌ ఎన్టీఆర్‌ 9 కిలోలు..!)

 

Videos

పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

Oracle ఉద్యోగాల ఊచకోత వెనుక అసలు కథ

5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెడితే... ఓపెన్ చేసి చూస్తే షాక్

శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్

జెడ శ్రవణిను కలిసిన అంబటి రాంబాబు

పెట్రోల్, డీజిల్ ధరల పెంచేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్..!

అజయ్ కోపం చూసి షాక్ అయిన మంచు లక్ష్మి

జగనన్న కోసం వస్తే పోలీసులు కర్రలతో కొడుతున్నారు

సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Photos

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)

+5

బ్లాక్ శారీలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెహ్రూ జూ పార్కులోని మూగజీవులకు వేసవి తాపం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ఉత్సాహంగా విశాల్‌ దివస్‌ (ఫొటోలు)

+5

'తిమ్మరాజుపల్లి టీవీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)