తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్
'దేవర' సెట్స్‌లో మహేశ్ 'వారణాసి'.. ఎందుకంటే?
Published on Wed, 04/15/2026 - 12:12
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'వారణాసి'. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఉగాదికి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రతినాయకుడు పృథ్వీరాజ్‌కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం మహేశ్ బాబుతో నీటి అడుగున కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం 'దేవర' సెట్స్ ఉపయోగించుకుంటున్నారట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)
లెక్క ప్రకారం 'వారణాసి' మూవీకి సంబంధించి అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం విదేశాలకు వెళ్లాలని మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంది. కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్లాన్ మార్చుకున్న 'వారణాసి' టీమ్.. హైదరాబాద్‌లో 'దేవర' కోసం తయారు చేసిన వాటర్ సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నారట. ఇకపోతే రెండు మూడు రోజుల క్రితమే పడవలో ఫైట్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. వీటిపై చిత్రబృందం అప్రమత్తమైంది.
టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో గ్లోబల్ అడ్వెంచర్‌గా 'వారణాసి' సినిమాని తీస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీ థీమ్ ఏంటో చెబుతూ గతంలో విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో ఆకట్టుకోగా.. త్వరలోనే కొత్త పాటని రిలీజ్ చేసే అవకాశముంది.
(ఇదీ చదవండి: అంతా రెండో భాగంలోనే.. 'రామాయణ'పై యష్ కామెంట్స్)
Tags : 1