Breaking News

నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!

Published on Tue, 04/14/2026 - 15:57

ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?

బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్రెషర్ల ఆవేదన

‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్‌తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.

వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

టెక్ వర్గాల్లో తీవ్ర నిరసన

ఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్‌పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్‌ఫైర్‌లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.

కంపెనీ స్పందన కోసం నిరీక్షణ

ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)