లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..
Breaking News
ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ..!
Published on Mon, 04/13/2026 - 11:21
బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశాభోంస్లే ఎనిమిది దశాబ్దాలుగా సాగిన నేపథ్య గాన వృత్తికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎందరో అభిమానుల మనసు దోచుకున్న ఆ మధుర స్వరం 92 ఏళ్ల వయసులో ఏప్రిల్ 12, 2026న నిశబ్దంగా మారిపోయింది. బహుళ అవయవాల వైఫల్యం కారణంగా గాయని ఆశా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆ గాయని మిగిల్చిన కొన్ని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుందామా..
79 ఏళ్ల వయసులో ఆశా మనీష్ మల్హోత్రా కోసం ర్యాంప్‌పై నడచి తనదైన శైలి, హుందాతనంతో అందర్నీ ఆశ్చర్యపరించారామె. దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసని అంటున్నారు మనీష్ మల్హోత్రా నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. తన షోలలో ఒకదానిలో ఆమె నడిచిన తీరును గుర్తుచేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. నా ఫ్యాషన్ వీక్ షోలో మీరు ఉన్నప్పటి చిత్రాలు ఇవి అంటూ నాటి ఫోటోలను షేర్ చేస్తూ..ర్యాంప్‌పై ఒక్కసారైన నడవాలన్నదే నా కోరిక అని నాతో చెప్పారు.
ఆ నిమిత్తమై మేము మిమ్మల్ని సాధరంగా అడిగినప్పుడూ.. మీరు వెంటనే అంగీకరించిఎంతో హుందాగా, స్టైలిష్‌గా సంతోషంగా నడిచారు. మీరు అలా ర్యాంప్‌పై నడవగానే..ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అది నేనెప్పుడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ. మీరు ఎప్పటికీ మా హృదయలో పదిలంగా ఉంటారు అంటూ మల్హోత్రా తన పోస్ట్‌ని ముగించారు. కాగా, ఆశా భోంస్లే పార్థివ దేహాన్ని ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె ఇంటికి తీసుకెవెళ్లారు. పార్థివ దేహాన్ని సోమవారం(ఏప్రిల్ 13, 2026) మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
(చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!)
Tags : 1