Breaking News

చెల్లెలు ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్‌

Published on Sun, 04/12/2026 - 13:54

లెజెండరి సింగర్‌ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్‌తో ఉన్న విభేదాన్ని షేర్‌ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.

అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?
లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో  ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్‌ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.

లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్‌లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే,  కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.

1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్‌కా రీ బెహ్‌కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో  ఆశా భోంస్లే  ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్‌లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.  ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్  2022లో  కోవిడ్-19,  న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు.

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)