షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..
Breaking News
ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు
Published on Sun, 04/12/2026 - 11:20
తెలుగు యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై ఫిర్యాదు రావడంతోనే ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)
అసలేం జరిగిందంటే?
ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్‌స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పలు షోలతో అలరించే విష్ణుప్రియ, కాసులకు కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టా అకౌంట్ బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.
(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)
Tags : 1