అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
Breaking News
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Published on Sat, 04/11/2026 - 13:15
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్‌తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
యూత్ కథేంటంటే..
ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్‌లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్‌లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
Tags : 1