Breaking News

అసలు కథ ఇదేనా?

Published on Fri, 04/10/2026 - 00:05

ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఏ వార్త బయటకొచ్చినా చర్చనీయాంశమౌతోంది. తాజాగా ‘వారణాసి’ స్టోరీ లైన్‌ ఇది అంటూ ఓ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తున్న స్టూడియో ఒకటి ఈ సినిమా కథను క్లుప్తంగా తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ‘‘శివభక్తుడు (మహేశ్‌బాబు) కాలాతీతమైన ఓ సాహసోపేతమైన ప్రయాణం చేస్తూ, శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన నిగూఢ రహస్యాలను చేధించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అపారమైన శక్తి కలిగిన ఒక వస్తువు జాడ కనుక్కుని, దాన్ని చేజిక్కించుకోవడం అతని లక్ష్యం.

ఈ క్రమంలో తాను ప్రయాణం చేసేలా పరిస్థితులను సృష్టించి, ప్రపంచంపై శాశ్వత ఆధిపత్యం సాధించాలనే క్రూరమైన సంకల్పం కలిగిన వ్యక్తి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ శివభక్తుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఆ తర్వాతి పరిణామాలు ఏంటి? అన్నదే ‘వారణాసి’ కథాంశం’’ అని’’ ఆ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ రాసుకొచ్చింది. దీంతో... ‘వారణాసి’ స్టోరీ ఇదేననే ప్రచారం సాగుతోంది. మరి... అసలు కథ ఇదేనా? అనేది తెలియాల్సి ఉంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారాణాసి’. ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

విలన్‌ కుంభగా పృథ్వీరాజ్, మందాకినిగా ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో పృథ్వీరాజ్‌ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. మహేశ్‌బాబు, ప్రియాంకాలపై చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. బాబుల్‌ సుప్రియోతో ఓ పాటను రికార్డు చేసినట్లుగా చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ పాటను ఉద్దేశించే ఆయన పేర్కొన్నారని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)