Breaking News

నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..

Published on Thu, 04/09/2026 - 10:50

ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్‌ని అందుకున్నాడంటే..

ఆ వ్యక్తే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కి చెందిన అబ్దుల్‌ రైస్‌. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. 

మరోవైపు వర్షాకాలంలో  ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్‌ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. 

ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్‌కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్‌పూర్‌లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. 

నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్‌ రైస్‌.

(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..)
 

 

Videos

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాకాణిపై మరో అక్రమ కేసు

నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన

నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్

Photos

+5

Allu Arjun Birthday Celebrations : సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)