ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
రియల్టీకి ‘సీజ్ఫైర్’ ఊతం
Published on Thu, 04/09/2026 - 08:40
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.
యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులు
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.
డిమాండ్ బౌన్స్‌బ్యాక్
కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్‌లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలు
అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
Tags : 1