బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
Breaking News
నయనతార సడన్ సర్ప్రైజ్.. స్టేజ్‌పై భర్త ఎమోషనల్
Published on Wed, 04/08/2026 - 08:49
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్‌పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసింది. ప్రమోషనల్ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్‌మీట్‌లోనూ పాల్గొని సందడి చేసింది.
సర్ప్రైజ్
తాజాగా మరోసారి ప్రమోషన్స్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మంగళవారం (ఏప్రిల్ 7న) గ్రాండ్‌గా జరిగింది. విఘ్నేశ్ మాట్లాడుతున్న సమయంలో నయన్ సడన్‌గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు.
వీడియో వైరల్
భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్‌లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కోసమే నయన్ ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ఐకే (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్‌టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J
— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026
Tags : 1