ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
ప్రియదర్శన్ విడాకులకు, భార్యతో కలిసిపోవడానికి ఒక్కటే కారణం!
Published on Mon, 04/06/2026 - 15:18
కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కెరీర్ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్‌బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది.
2016లో విడాకులు
ఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్‌లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.
ఇటీవలే కలిసిపోయిన జంట
అప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్‌గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది.
అసలు కారణమిదే!
దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్‌గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్‌గా ఉంటే బోర్ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!
చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్ సింగర్
Tags : 1