Breaking News

గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ విరాళాల నిలిపివేత?

Published on Mon, 04/06/2026 - 12:03

దాతృత్వానికి చిరునామాగా నిలిచే ప్రపంచ కుబేరుల మధ్య దశాబ్దాల స్నేహం ఇప్పుడు సంక్షోభంలో పడింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ మధ్య ఉన్న అనుబంధం జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వివాదంతో బీటలు వారుతోంది. ఈ క్రమంలోనే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు తాను ఇస్తున్న భారీ విరాళాలను బఫెట్ నిలిపివేసే అవకాశం ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై బఫెట్ మౌనం?

ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో బఫెట్ మాట్లాడుతూ.. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తాను బిల్ గేట్స్‌తో మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు. వారిద్దరూ కలిసి గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూనే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగించడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ వివాదంలో భాగంగా దశాబ్దాల నాటి ఫౌండేషన్ కార్యకలాపాలపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం, విరాళాలకు సంబంధించి ప్రమాణం చేసి సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని బఫెట్ స్పష్టం చేశారు. ఫౌండేషన్‌లో తన పాత్ర కేవలం నిధులు సమకూర్చడానికే పరిమితమని ఆయన గుర్తు చేశారు.

విరాళాల కొనసాగింపుపై సందిగ్ధత

గేట్స్ ఫౌండేషన్‌కు ఆర్థిక సహాయం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు బఫెట్ నేరుగా సమాధానం చెప్పలేదు. ‘వేచి చూద్దాం ఏం జరుగుతుందో’ అని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజా పరిణామాల ద్వారా తనకు తెలియని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అంగీకరించడం గమనార్హం. అయితే, ఎప్‌స్టీన్‌ ఆరోపణల్లో బిల్‌గేట్స్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తాను నమ్మడం లేదని బఫెట్ పేర్కొన్నారు.

యాపిల్ వాటాల తగ్గింపుపై వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో బఫెట్ తమ సంస్థ బెర్క్‌షైర్ హాత్వేకి సంబంధించిన కీలక వ్యాపార నిర్ణయాలను పంచుకున్నారు. యాపిల్ ఇంక్‌లో తమకున్న భారీ వాటాను ఇప్పటికే తగ్గించామని బఫెట్ అంగీకరించారు. డిసెంబర్ నాటికి ఈ హోల్డింగ్స్ గరిష్ట స్థాయిల నుంచి 75 శాతం మేర తగ్గడం విశేషం. బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బఫెట్ ఇంకా చైర్మన్‌గా చురుగ్గా పని చేస్తున్నారు. రోజువారీ పెట్టుబడి నిర్ణయాల్లో పాల్గొంటున్నప్పటికీ తుది నిర్ణయాలను మాత్రం కొత్త సీఈఓ గ్రెగ్ అబెల్ తీసుకుంటారని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)